Home

»

Latest News

'ఆచార్య' అప్‌డేట్‌: మ‌హేశ్ ఔట్‌.. చ‌ర‌ణ్ ఇన్‌!

Mar 18, 2020 12:51PM

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్‌ను క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా ఆపివేసిన విష‌యం తెలిసిందే. చిరంజీవి స‌ర‌స‌న నాయిక‌గా అనుష్క న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలోనే మ‌రో విష‌యం వెల్ల‌డైంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో ఒక స్పెష‌ల్ రోల్ చేయ‌డానికి ఇప్ప‌టికే అంగీక‌రించిన మ‌హేశ్‌, ఈ సినిమా నుంచి వైదొల‌గాడు. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని తెలిపాయి. ఈ సినిమా విష‌యంలో మ‌హేశ్‌కు జ‌రిగిన అసౌక‌ర్యానికి రామ్‌చ‌ర‌ణ్ విచారం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. మెగా ఫ్యామిలీతో మొద‌ట్నుంచీ మ‌హేశ్‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి. మ‌హేశ్‌, చ‌ర‌ణ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. 

చిరంజీవి స్వ‌యంగా ఫోన్ చేసి అడ‌గ‌డం, కొర‌టాల చెప్పిన క్యారెక్ట‌ర్ న‌చ్చి 'ఆచార్య‌'లో న‌టించ‌డానికి మ‌హేశ్ అంగీక‌రించాడు. అత‌ను డిమాండ్ చేయ‌క‌పోయినా, మ‌హేశ్‌కు ఉన్న సూప‌ర్ స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో ఉంచుకొని రోజుకు కోటి రూపాయ‌ల పారితోషికం ఇచ్చేందుకు చ‌ర‌ణ్‌, మ‌రో నిర్మాత నిరంజన్‌రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. కానీ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలతో మ‌హేశ్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొనే విష‌యంలో చిరంజీవి, చ‌ర‌ణ్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. చివ‌ర‌కు మ‌హేశ్‌తో ఆ పాత్ర‌ను చేయించే ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టేసి, మొద‌ట అనుకున్న విధంగా చ‌ర‌ణ్ ఆ క్యారెక్ట‌ర్ చేస్తే మంచిద‌ని చిరంజీవి భావించారు. చ‌ర‌ణ్ కూడా ఇందుకు స‌రేన‌న్నాడు.

'ఆర్ఆర్ఆర్‌'లో త‌న పోర్ష‌న్ పూర్త‌యిన వెంట‌నే, 'ఆచార్య' షూటింగ్‌లో పాల్గొనాల‌ని చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడు. క‌థానుసారం అత‌నికీ ఒక జోడీ ఉంటుంది. ఆ పాత్ర‌కు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకు రావ‌డానికి సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. మ‌హేశ్‌ను ఆ క్యారెక్ట‌ర్ కోసం సంప్ర‌దించిన త‌ర్వాత అత‌ని స‌ర‌స‌న కియారా అయితే బాగుంటుంద‌ని అప్పుడే డైరెక్ట‌ర్ కొర‌టాల భావించాడు. 'భ‌ర‌త్ అనే నేను' మూవీలో మ‌హేశ్‌, కియారా మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవ‌డం తెలిసిందే. చ‌ర‌ణ్ వ‌చ్చినా ఇబ్బందేమీ లేదు. చ‌ర‌ణ్‌తోనూ కియారా 'విన‌య విధేయ రామ‌'లో చేసిన విష‌యం తెలిసిందే. ఆ మూవీ ఫ్లాపైనా, ఆ ఇద్ద‌రి జోడీ ఆక‌ట్టుకుంది. పైగా ఆ సినిమాతో ఆ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు కూడా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com