Home

»

Latest News

వేదికపై ఈ చండాలాలేంటి నాయనా?

Aug 07, 2017

ఎక్కడ ఎలా ఏడ్చినా... వేదికల మీద ఉన్నప్పుడు మాత్రం కాస్త హుందాగా ఉండాలి. అది సభా మర్యాద కూడా. వేదికలపై అభిమానాలను ఒలకబోసుకోవడం, ఒకరికొకరు పొగుడుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువైంది. సినిమా రంగంలో అయితే మరీనూ. 

హీరోలకేమో.. బుర్రలో బుద్ది ఉండదు. హీరోయిన్లకేమో ఒంటిపై గుడ్డ ఉండదు. ఇలా తయారయ్యారు సినిమా తారలు. సినిమా వేడుకలకు చిట్టిపొట్టి బట్టలేసుకొచ్చి ఫొటోగ్రాఫర్స్ కెమెరాలకు కావల్సినంత పని ఇస్తూ.. మన కథానాయికలు పెద్ద మనసుని చాటుకుంటుంటే.... వేదికల పై ఒకళ్లకొకళ్లు పొగుడు కుంటూ... ముద్దులు పెట్టుకుంటే... హీరోలు కొత్త దరిద్రానికి తెరలేపారు. 

హిందీలో అయితే... ఇంకాస్త ముందుకెళ్లి మగాళ్లు మగాళ్లు లిప్ లాక్ లు చేసుకునే ఛండాలానికి కూడా దిగజారుతున్నారు. ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్లో కథానాయకుడు రణబీర్ కపూర్ ని దర్శకుడు అనురాగ్ బసూ వేదికపై లిప్ లాక్ చేసేడు. ఏదో పొరపాటున జరిగి ఉంటుందిలే అని అప్పుడు అందరూ అనుకున్నారు. అది మరిచిపోయేలోపే.. మళ్లీ మరో వేదికపై ఇలాగే వారిద్దరూ అధర చుంబనం కానిచ్చేశారు. ఇక చెప్పేదేముంది? దేశ వ్యప్తంగా ఒకటే  రచ్చ. 

ఇప్పుడు ఈ గజ్జి టాలీవుడ్ కి కూడా అంటుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఈ మధ్య ‘అర్జున్ రెడ్డి’పాటల వేడుకలో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, అతిథిగా విచ్చేసిన హీరో నానిని సభపై అందరూ చూస్తుండగా కిస్ చేశాడు. అయితే... బాలీవుడ్ లో జరిగింది లిప్ లాక్. 


ఇక్కడ మామూలు ముద్దే. అయినా.. అభిమానం ఉంటే... అది సభలో అందరి ముందు ప్రదర్శించుకోవాలా? అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ కలిసి గతంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రలో నటించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తొలి సినిమా కూడా అదే. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com