బాహుబలి-2కి ప్రాణంపోసిన కట్టప్ప
on Apr 27, 2017
కట్టప్ప పాత్ర లేనిదే బాహుబలి సినిమాకి బలం లేదు. కట్టప్ప అంటే మామూలు వాడా! కంటిచూపుతో కత్తుల్ని సైతం పరీక్షించగలవాడు. కానీ అనూహ్యంగా అదే కట్టప్ప చేత కామెడీ చేయించాడు రాజమౌళి. సీరియస్ సినిమాలో భాగంగా వచ్చే ఈ కామెడీ కొందరికి రిలీఫ్ కలిగించినా... మరికొందరు మాత్రం కట్టప్పతో కామెడీ ఏందబ్బా అంటూ జీర్ణించుకోలేకపోతున్నారు. బాహుబలి మొదటి భాగంలో తనేమిటో నిరూపించుకున్న కట్టప్ప, రెండో భాగంలోనూ తన హవాని కొనసాగించారు. ముఖ్యంగా ఒకటిరెండు సన్నివేశాలలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటన, సినిమాని మరో స్థాయికి చేర్చింది. కన్నడిగుల మీద తను చేసిన విమర్శతో సత్యరాజ్ బాహుబలి -2 విజయానికి అడ్డుపడతాడని భయపడ్డారు. కానీ అదే సత్యరాజ్ బాహుబలి-2కి ప్రాణంగా నిలవడం రాజమౌళికి ఊరట కలిగించే విషయం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
