
'పొలిమేర', 'పొలిమేర 2', 'మంగళవారం' వంటి చిత్రాల్లో విభిన్న షేడ్స్ కలిగిన క్యారెక్టర్స్ ని పోషించిన భామ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla). రీసెంట్ గా డెకాయిట్ లో ప్రాధాన్యత గల క్యారక్టర్ తో మెప్పించింది. వృత్తి రీత్యా డాక్టర్ కూడా అయిన కామాక్షి సమాజంలో ఉన్న సున్నితమైన అంశాలపై నిర్భయంగా మాట్లాడుతూ తన భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న వ్యక్తిగత విషయాలు, సమాజంపై ఆమె చేసిన ఘాటైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా లైంగికత, చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, మరియు ప్రేమ,బ్రేకప్‌ల గురించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
కామాక్షి మాట్లాడుతు సెక్స్‌ని సమాజంలో ఒక బూతులా, పాపంగా ఎందుకు చూస్తున్నారో తెలియడం లేదు. అది ప్రతి మనిషి జీవితంలో ఒక సహజమైన భాగం. చేతులు కలపడం దగ్గర్నుంచి సెక్స్ వరకు అన్ని శారీరక, మానవ శక్తుల మార్పిడే. మనసులోని ఆలోచనని పంచుకోవడం గొప్పదైనప్పుడు శారీరక కలయికని తప్పుగా చూడటం కరెక్ట్ కాదు. కాబట్టి శృంగారం అనేది కేవలం ఒక బూతు కాదు. అలాంటి అంశాన్ని దాచాల్సిన అవసరం లేదు. సమాజంలో దీనిపై ఉన్న మూఢనమ్మకాలు మారాలి.
మరో బాధాకరమైన విషయం ఏమిటంటే నాలుగు సంవత్సరాల వయసులో లైంగిక వేధింపులుకి లోనయ్యాను. ఆ వయసులో తనకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు. అది ఒక తప్పుడు ప్రవర్తన అని మాత్రం తెలిసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఇంట్లో ఉండాలి.
Also read: Peddi: పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ఎగ్జిబిటర్లతో సమావేశంలో జరగబోయేది ఇదేనా!
నాకు ఇప్పటి వరకు మూడు సార్లు బ్రేక్ అప్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ బంధాలు ముగిసిపోయాయి. కానీ చైనాలో ఉండి చేసిన 6 సంవత్సరాల వైద్య విద్యాభ్యాసం, అక్కడి అనుభవాలు నన్ను మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి సహాయపడ్డాయని చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకి చెందిన కామాక్షి అపోలో లో డాక్టర్ గా సేవలందించారు






