Home

»

Latest News

క‌ల్యాణ్ రామ్‌కి ఆ హీరోయిన్ న‌చ్చ‌లేదు

Apr 23, 2015 11:01AM

 

ప‌టాస్‌తో ఎట్ట‌కేల‌కు ఓ హిట్ కొట్టాడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఈ ఫామ్‌ని కొన‌సాగించాలని.. త‌న త‌దుప‌రి సినిమాపై మ‌రింత దృష్టి పెట్టాడు. ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ షేర్ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదీ పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ల‌ను బాగా రంగ‌రించారట‌. అయితే.. సినిమాలో ఎక్క‌డో ఓ చోట వెలితి క‌నిపించింది. అందుకే హీరోయిన్ ని మార్చేసి, మ‌రో హీరోయిన్‌ని తెచ్చుకొన్నాడు. ఈ సినిమాలో ముందుగా వ‌న్య‌మిశ్ర‌ని ఎంపిక చేశారు. ఆమెతో కొన్ని స‌న్నివేశాలు కూడా తెర‌కెక్కించారు. ఎందుకో మ‌రి.. ఆ హీరోయిన్ న‌ట‌న‌పై క‌ల్యాణ్‌రామ్ సంతృప్తి క‌ల‌గ‌లేదు. దాంతో.. ఆమెను ప‌క్క‌న పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. ఈ స్థానంలో లెజెండ్ క‌థానాయిక‌గా సోనాల్ చౌహాన్ ని ఎంపిక చేశాడు క‌ల్యాణ్ రామ్‌. బాబాయ్ బాల‌య్య‌తో సంద‌డి చేసినా సోనాల్... ఇప్పుడు అబ్బాయ్‌తో ఆడిపాడ‌బోతోంద‌న్న‌మాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com