కాజల్ మేనేజర్ మగడ్రా బుజ్జీ...!
on Jul 24, 2017

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకూ హీటెక్కి పోతోంది. ఇప్పటికే పన్నెండు మందికి నోటీసులు విడుదల చేసి, విచారణ జరుపుతున్న పోలీసులు... ఇంకా ఓ బడా హీరో కూడా ఉన్నాడు... అతనికీ నోటీసులు పంపుతాం... అని ప్రకటించేసి పరిస్థితిని మరింత వేడి పుట్టించారు. ఇదిలావుంటే... మరోవైపు ఈ లొల్లీలోకి హీరోయిన్ల పేర్లు కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కథానాయిక కాజల్ మేనేజర్ రోనీ అరెస్టే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకెళ్తే...
బయట ఇంత గొడవ జరుగుతుంటే... ఏకంగా ఇంట్లోనే గంజాయి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడట కథానాయిక కాజల్ మేనేజర్ రోనీ. అతనికి చాలాకాలంగా డ్రగ్స్ అలవాటు కూడా ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. రోనీ ఇంటిమీదకు రైడ్ చేశారు. మనోడు ఫుల్లుగా గంజాయి కొడుతూ... పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడు.
ప్రస్తుతం పోలీసులు రోని ని విచేరించే పనిలో నిమగ్నమయ్యారు. సెలబ్రిటీలనైతే... లైట్ గా డీల్ చేసే పోలీసులు... పాపం రోనీ లాంటి వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం కాజల్ కి మేనేజర్ గా పని చేస్తున్న రోనీ... అంతకు ముందు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నాల దగ్గర కూడా పని చేశాడు. మరి ముందు ముందు ఏ ఏ వార్తలు వినాల్సి వస్తుందో
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



