కాజల్ ముద్దు 18 సెకన్లు..!
on Jun 9, 2016
ఇదేదో నాకు అలవాటు లేదంటూనే చాలా కష్టపడి ఆన్ స్క్రీన్ లిప్ కిస్ చేసింది చందమామ కాజల్. సౌత్ ఇండియాలో నేను ఎప్పుడూ ఈ ఫీట్ చేయలేదు. చాలా కష్టపడ్డాను అంటూ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చాలానే విషయాలు చెప్పింది. అయితే ఇదే ఆమె ఫస్ట్ లిప్ కిస్ అని సెన్సార్ వాళ్లు ఊరుకోరు కదా.. టోటల్ గా 18 సెకన్ల పాటు ఉన్న ముద్దు సీన్ ను కత్తిరించేసి, సగానికి అంటే 9 సెకన్లకు తెగ్గొట్టేశారు. ఇంతకీ విషయమేంటంటే, కాజల్ ఇప్పుడు బాలీవుడ్ లో దో లఫ్జోంకీ కహానీ అనే సినిమా చేస్తోంది. సినిమా హీరో రణ్ దీప్ హుడా తో దాదాపు 18 సెకన్ల డ్యూరేషన్ తో కాజల్ చేసిన లిప్ కిస్ సీన్ ఉంది. ఈ సీన్ కు సెన్సార్ వాళ్లు అడ్డు చెప్పి మొత్తం తీసేస్తాం అన్నారట. అయితే దర్శక నిర్మాతలు సినిమాలో సీన్ ప్రాముఖ్యత గురించి చెప్పి, ఎలాగోలా బ్రతిమాలితే 9 సెకన్ల వరకూ కనికరించారట. దీంతో పాటు కొన్ని చోట్ల డైలాగులను కూడా మ్యూట్ చేశారట. చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే ఇంత పని జరిగిందేంటి చెప్మా అని పాపం చందమామ అభిమానులు తెగ ఇదైపోతున్నారు.