కాజల్ ఆ సీన్ ఎలా చేసిందో తెలుసా..?
on May 30, 2016
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ భారీ ఫ్లాపుల్ని ఖాతాలో వేసుకున్న కాజల్ చూపులన్నీ బాలీవుడ్ లో చేసిన దో లఫ్జోం కీ కహానీ పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్టైతే కనీసం ఇంకో ఏడాది రెండేళ్ల కెరీర్ లాగించేయచ్చు అనుకుంటోందీ భామ. రణ్ దీప్ హుడా హీరోగా చేస్తున్న ఈ సినిమా పోస్టర్లు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకూ పూర్తి లిప్ లాక్ ట్రై చేయని కాజల్, ఈ సినిమా కోసం తొలిసారి భారీ లిప్ లాక్ సీన్ చేసింది. పోస్టర్ గా కూడా ఈ లిప్ లాక్ నే వదిలారు మూవీ టీం. అయితే ఇంత ఘాటైన ముద్దు సన్నివేశాన్ని ఎలా చేశావు పాపా అని అడిగితే, ఆ సమయంలో నేను రాయిలా మారిపో్యాను. ఇలాంటివి నాకు ఇష్టం లేకపోయినా గుండె రాయి చేసుకున్నాను అని చెప్పుకొస్తోంది. అయితే మీడియా మాత్రం దీన్ని పెద్ద ఇష్యూ చేస్తోందని మండిపడుతోంది. నేను ఇంతకు ముందు ఇలాంటి సీన్లు ఎప్పుడూ చేయలేదు. అయితే రణ్ దీప్ హుడా నాకు ఇబ్బంది లేకుండా హెల్ప్ చేశాడు. అతని వల్లే నాకు ఎలాంటి భయం లేకుండా షూటింగ్ లో పాల్గొన్నాను. అయితే ఈ సీన్ గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుందో అన్నది మాత్రం నాకు అర్ధం కావడం లేదు అంటోంది చందమామ. సినిమాలో కాజల్ ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తోంది. 2011 లో వచ్చిన సూపర్ హిట్ కొరియన్ సినిమా ఆల్వేస్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం విశేషం.