Home

»

Latest News

రెండు కోట్ల‌కు ప‌డిపోయిన కాజ‌ల్‌

Aug 5, 2015 12:20PM

డ‌బ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్ద‌లు. క‌థానాయిక‌లూ పారితోషికానికే ప‌డిపోతుంటారు. ఇప్పుడు.. కాజ‌ల్ ప‌రిస్థితీ అంతే. స్టార్ హీరోల‌తో త‌ప్ప‌, చిన్నా చిత‌కా హీరోల ప‌క్క‌న న‌టించ‌నుగాక న‌టించ‌ను అని స్ట్రాంగ్ గా ఫిక్స‌యి, చాలా అవ‌కాశాల్ని అలానే వ‌దిలేసింది కాజ‌ల్‌. అయితే అందంతా స్టార్ హోదా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కాదు, అవ‌కాశాలు లేన‌ప్పుడు కూడా ఇదే సూత్రం పాటించింది.

అయితే ఇప్పుడు ఈ ష‌ర‌తుకు కాస్త మిన‌హాయింపు ఇచ్చింది. `అడిగినంత‌ పారితోషికం ఇస్తే ఎవ‌రితో అయినా న‌టిస్తా` అని పిక్స‌యిపోయింది. అందుకే ఇప్పుడు లారెన్స్ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ముని 4 తెర‌కెక్కుతోంది. త‌నే హీరో.

ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌మ‌ని కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `రెండుకోట్లు` డిమాండ్ చేసింద‌ట‌. దానికి లారెన్స్ కూడా ఒప్పుకోవ‌డంతో ఈ సినిమాని ఫిక్స్ చేసేసింది కాజ‌ల్‌. ఇది వ‌ర‌కు లారెన్స్ త‌మ్ముడు సినిమాలో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `నో` అనేసింది. పారితోషికం ఎంతిస్తాన‌న్నా.. చేయ‌ను అని చెప్పింద‌ట‌. ఇంత‌లోనే కాజ‌ల్‌లో ఎంత మార్పు..??? రెండు కోట్ల‌కు ప‌డిపోయింది. కోట్లా. మ‌జాకా?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com