అన్నగారికి నివాళులర్పించిన ఎన్టీఆర్...!
on May 26, 2016

మే 28. నందమూరి అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రదేశాన్ని, తెలుగు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపిన మహానటుడు ఎన్టీఆర్ జయంతి. అభిమానులకే కాదు. తాత పోలికలతో పాటు నటననూ పుణికిపుచ్చుకున్న ఆయన మనవడు ఎన్టీఆర్ కు కూడా అది చాలా ఇష్టమైన రోజు. అయితే తన షూటింగ్ కారణంగా ఆరోజు చెన్నైలో షూటింగ్ లో ఉండాల్సి రావడంతో ఈ రోజే ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళులర్పించాడు. ఆయనతో పాటు జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావుగారికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి సరాసరి చెన్నై చేరుకున్నాడు తారక్. అక్కడ జరిగే నెక్స్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



