ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా...!
on May 17, 2016

మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఆరోజే చిన్న తారకరాముడు జన్మించాడు మరి. అలాంటి స్పెషల్ డే రోజున తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది..? ఎన్టీఆర్ కూడా ఇదే అనుకున్నట్టున్నాడు. అందుకే తన ఫ్యాన్స్ కు ఒకటి కాదు, ఏకంగా డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నాడు. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ ను మే 19న రిలీజ్ చేస్తున్నారు. దీనితో పాటే ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చే సినిమాకు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజవ్వబోతోందట. ఇప్పటికే పూరీ జగన్నాథ్ నేతాజీ అనే టైటిల్ ను కూడా ప్రకటించేశాడు. ఈ సినిమా ఇంకా మొదలవ్వనప్పటికీ, టైటిల్ ను మాత్రం డిజైన్ చేయించి వదిలే ఆలోచనలో పూరీ ఉన్నాడట. బర్త్ డే రోజునే మూవీకి సంబంధించిన డిటెయిల్స్ కూడా చెబుతాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జనతాగ్యారేజ్ ఆగష్ట్ 12 న రిలీజ్ అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



