Home

»

Latest News

సిస్ట‌ర్ మ‌హేశ్వ‌రి అని నీతో చెప్పానా.. జేడీ ఫైర్!

Mar 04, 2021

 

రామ్ గోపాల్‌వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన వాళ్ల‌లో అత్య‌ధిక శాతం మంది ఓ ప‌ట్టాన కాంప్ర‌మైజ్ కారు. అక్క‌డ ఎవ‌రున్నా స‌రే వారి బ్రెయిన్‌ వాష్ చేసేస్తుంటారు. ఇక అదే స్కూల్ నుంచి వ‌చ్చిన  జేడీ చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికీ త‌న‌దైన పంథాని అనుస‌రిస్తూ సినిమాలు చేస్తున్నారాయ‌న‌. ఇట‌వ‌ల '70 ఎం.ఎం.' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చి షాకిచ్చారు జేడీ. ఇంట‌ర్వ్యూలో భాగంగా హీరోయిన్ మ‌హేశ్వ‌రికి సంబంధించిన టాపిక్ రావ‌డంతో జేడీ స్పందించారు. 1995లో వ‌చ్చిన 'గులాబీ' చిత్రం అప్ప‌ట్లో ఏ స్థాయి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇందులో జేడీ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హేశ్వ‌రి జంట‌గా న‌టించారు. ఆ టైమ్‌లో వీరిద్ద‌రు ప్రేమ‌లో వున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి.

ఇదే విష‌యాన్ని జేడీని యాంక‌ర్ అడిగితే ఫైర‌య్యాడు. "మీతో న‌టించిన హీరోయిన్‌ల‌తో ట‌చ్‌లో వున్నారా?..'సిస్ట‌ర్ మ‌హేశ్వ‌రి'అని అంటారుగా ఆమెతో ట‌చ్‌లో వున్నారా?" అని యాంక‌ర్ జేడీని ప్ర‌శ్నించడంతో.. జేడీ చ‌క్ర‌వ‌ర్తికి ఎక్క‌డో కాలింది.. దీంతో "సిస్ట‌ర్ మ‌హేశ్వ‌రి అని నీతో చెప్పానా?.. నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం లేదు క‌దా అని చెప్పి వుంటాను. నీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలా.. ఏజ్‌లో ఆమె కంటే ఒక‌టి రెండేళ్లు పెద్ద కావ‌చ్చు కానీ ఇంట‌లిజెన్స్‌లో మ్యాగీ (మ‌హేశ్వ‌రీ) కంటే చిన్నోడినే." అంటూ క్లారిటీ ఇచ్చాడు జేడీ. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com