Home

»

Latest News

టెన్షన్ లో 'జై లవకుశ' యూనిట్...

Aug 19, 2017 3:49PM

 

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న సినిమా 'జై ల‌వ‌కుశ‌'. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణంలో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ టెన్షన్ లో పడిందటా.. ఎందుకనుకుంటున్నారా..? సినిమా ఎక్కడ వాయిదా వేయాల్సివస్తుందబ్బా అని. ఈ సినిమాను ఎలాగైనా సరే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ 21 న రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. దీంతో ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ అయినా సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమా యూనిట్ టెన్షన్ లో పడిందట.

 

కాగా ఈ సినిమాకు సంబంధించి ‘జై లవకుశ’ రెండో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యింది. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే ‘జై’ టీజర్ విడుదలై యూ ట్యూబ్‌ను షేక్ చేసేసింది. ఇప్పుడు లవకుమార్ టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com