Home

»

Latest News

ఏడు నెలలు ఎవరైనా ఖాళీగా ఉంటాడా..?

Oct 13, 2017

జైలవకుశతో కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. అలాగే నెక్ట్స్ మూవీ ఎవరితో అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు జూనియర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశాడు కూడా. అయితే

ఇక్కడే జనానికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజంట్ త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇక ఆ మూవీ రిలీజైన తర్వాత ఎన్టీఆర్‌తో తాను చేయబోయే కథ కోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం తీసుకుంటాడు. అంటే సుమారు ఏడు నెలల కాలం ఎన్టీఆర్ ఖాళీగా ఉండాలి. కానీ ఇంతటి పీక్ టైంలో సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదని భావించిన జూనియర్ ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా నిర్మాత దిల్‌రాజుతో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌ టాక్. ఆరు నెలల్లోపు సినిమా తీయగలనని రాజు గారు హామీ ఇస్తే ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడట. మరీ అన్ని కుదిరితే అతి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని సినీ జనాలు అంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com