Home

»

Latest News

జ‌బ‌ర్‌ద‌స్త్ క‌మెడియ‌న్ కిడ్నాప్‌.. బ‌ల‌వంత‌పు పెళ్లి?

May 9, 2017 12:28PM


‘జబర్దస్త్’  తో పేరు తెచ్చుకొన్న క‌మెడియ‌న్‌ వినోద్ .  లేడీ గెట‌ప్‌లో... అచ్చం అమ్మాయిలా క‌నిపించే వినోద్‌ని అబ్బాయంటే ఎవ్వ‌రూ న‌మ్మరు. పైగా త‌న హావ భావాలు, గొంతు అచ్చంగా అమ్మాయిలానే ఉంటుంది. అందుకే జ‌బ‌ర్‌ద‌స్త్ తెర‌పై వినోద్ కాస్త వినోదిని అయిపోయింది. ఇప్పుడు ఈ వినోదినిపై ఓ హాట్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. వినోదినిని కిడ్నాప్ చేశార‌ని, బ‌ల‌వంతంగా పెళ్లి చేయాల‌ని చూశార‌ని టాక్‌.  వినోద్ ది క‌ర్నూలు జిల్లాలోని బొంద‌ల‌దిన్నె అనే ఓ గ్రామం. అక్క‌డ వినోద్ అమ్మ శిరోమ‌ణ‌మ్మ నివాసం ఉంటుంటోంది. త‌న మ‌న‌వ‌రాలికి వినోద్‌కి ఇచ్చి పెళ్లి చేయాల‌ని భావించింది. అయితే వినోద్ మాత్రం 'నాకు పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేదు' అని చెప్పేశాడ‌ట‌. అయినా స‌రే.. హైద‌రాబాద్‌లో ఉన్న వినోద్‌ని బ‌ల‌వంతంగా కిడ్నాప్ చేసి.. స్వ‌గ్రామం తీసుకెళ్లార‌ట‌.
 గురించి తెలుగునాట అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ గెటప్ తో కమెడియన్ గా తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న వినోద్ అలియాస్ వినోదినిగా బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన ఒరిజినల్ గెటప్ తో కంటే లేడీ గెటప్ తోనే జనాల్లో బలమైన ముద్ర వేసిన ఈ యువ హాస్యనటుడు.. తాజాగా కిడ్నాప్ అయినట్లు, ఆత్మహత్యాయత్నం చేసినట్లు న్యూస్ రావడం కలకలం రేపింది. ఆ వివరాలలోకి వెళితే, కడప జిల్లాకు చెందిన వినోద్ తల్లి శిరోమణమ్మ ప్రస్తుతం ఆమె సోదరి లక్ష్మమ్మతో కలిసి కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోందని సమాచారం. ఓ చర్చ్‌లో బ‌ల‌వంతంగా పెళ్లి చేయాల‌ని భావిస్తున్న త‌రుణంలో వినోద్‌.. పోలీసుల‌కు స‌మాచారం అందించాడ‌ట‌. వెంట‌నే పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి... ఈ పెళ్లిని ఆపేసిన‌ట్టు స‌మాచారం. అక్క‌డ జ‌రిగిన స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ‌లో వినోద్ కి గాయాల‌య్యాయ‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. బ‌ల‌వంతంగా పెళ్లి చేయాల‌నుకొన్న‌వారిపై, కిడ్నాప్ చేసిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ద‌మైన‌ట్టు స‌మాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com