పంచె తీసి..కోటేసిన మేస్ట్రో ఇళయరాజా..!
on May 5, 2016

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా... సుమారు నాలుగు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు ఇళయరాజా. ఆయన సంగీతానికి పరవశించని వారు లేరు. 72 ఏళ్ల వయసులోనూ యువ సంగీత దర్శకులతో పోటీ పడుతూ అలుపెరగని బాటసారిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయన ఇప్పటికి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇంట్లోనూ..వేదికలపైనా ఎప్పుడూ తెల్ల పంచెతో పైన జుబ్బాతో మాత్రమే కనిపించేవారు. కానీ ఆయన తన గెటప్ మార్చేశారు. ఓ మ్యూజికల్ కన్సర్ట్ కోసం ఈయన తెల్ల సూట్ వేశారు. ఈ లుక్‌లో ఇళయరాజాని చూసిన వారందరు స్టన్నవుతున్నారు. స్టైల్‌గా గిటార్ పట్టుకుని నిల్చుని స్పైల్ ఇస్తున్న ఆయన ఈ గెటప్‌లో అదిరిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



