ఒకరోజు లేటుగా రానున్న 'ఐస్‌క్రీమ్'
on Jul 9, 2014
.jpg)
'ఐస్‌క్రీమ్' కోసం ఇంకా వెయిటింగ్ తప్పదు. ఎంతగానో ఊరిస్తున్న రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'ఐస్‌క్రీమ్' విడుదల ఒకరోజు లేటుకానుందట. 'ఐస్‌క్రీమ్' చిత్రం ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సినిమా విడుదల తేదీ మారినట్లు సమాచారం. ప్రకటించిన తేదీకి ఒక రోజు లేటుగా, అంటే 12 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. నవదీప్, తేజస్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ పొందింది. చిత్రం విడుదల ఆలస్యానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ట్రెయిలర్ విడుదలయినప్పటి నుంచి వారవారం ఒక మీడియా సమావేశం నిర్వహిస్తూ, చిత్రానికి మంచి హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఫ్లో కాం టెక్నాలజీ, తేజస్వి గ్లామర్, ఆర్ జీ వి దర్శకత్వం ఈ విషయాలు ఆల్ రెడీ ప్రేక్షకులలో అంచనాలను పెంచేశాయని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



