తాగి బైకును ఢీకొట్టిన తనీష్..
on Oct 6, 2015
.jpg)
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెలబ్రిటీలు పట్టుబడటం ఫైన్ కట్టడం వారికి మామూలు విషయమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో హీరో తనిష్ కూడా బుక్కయ్యాడు. తాగిన మైకంలో కారు నడిపి.. బైకుపై ఉన్న వ్యక్త్తిని ఢీకొట్టాడు. ఈ నెల 1వ తేదీన తనీశ్ రాత్రి 9 గంటలకు తాగి కారు డ్రైవ్ చేస్తూ జూబ్లీహీల్స్ రోడ్డులో బైకుపై ఉన్న వ్యక్తిని ఢీ కొట్టాడు. అయితే బాధితుడు సురేష్ తన బైకుపైనే చేజ్ చేసి మరీ తనీష్ను అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. దీంతో తనీష్ కోర్టుకు హాజరు కాగా న్యాయమూర్తి కేవలం 50 రూపాయల జరిమానా విధించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



