Home

»

Latest News

28న 'గోపాల గోపాల’ ఫస్ట్‌లుక్‌

Nov 24, 2014 12:04PM

 Gopala Gopala First Look, Pawan kalyan Gopala Gopala, Pawan Gopala First Look

మెగా అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గోపాల గోపాల’ ఫస్ట్‌లుక్‌ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈనెల 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్‌ ఖరారు చేసిన విషయం తెల్సిందే. పవన్‌ను మోడ్రన్‌ శ్రీ కృష్ణుడిగా ఎప్పుడెప్పుడు చూస్తామాని ప్రేక్షకులు ఆసక్తిగానున్నారు. సురేష్‌బాబు, శరత్‌ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రేయ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు మిథున్‌ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com