సావిత్రి వారసురాలిని ప్రకటించిన మెగా బ్రదర్
on Jul 28, 2017
ఫిదా సంబరాలు అదేనండి ఫిదా సక్సెస్ మీట్ లో మెగా బ్రదర్ నాగబాబు కొంచెం ఎమోషనల్ అయ్యారు. సినిమాలో నటించిన నటులు, పనిచేసిన టెక్నిషియన్లను పేరు, పేరున పిలిచి అభినందించారు. హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, "దిల్ రాజు గారు నాకు ఫిదా స్పెషల్ షో వేశారు. మొదట, సాయి పల్లవిని మాములుగా చూడడం చేశాను. కానీ, పోను పోను భానుమతి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది.
మిస్సమ్మ లో సావిత్రి ఎంత బాగా నటించిందో, ఫిదా లో సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్ అంత బాగా చేసింది. నాకు తెలిసి సావిత్రి గారికి నిజమయిన వారసురాలు పల్లవే." నాగబాబు మాటల్లో కొంచెం అతిశయోక్తి ఉండొచ్చు కానీ, తాను సినిమాలో అద్భుతంగా నటించింది, సారీ జీవించింది. మనం సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయే మనల్ని హాంట్ చేస్తా ఉంటది. మనతో సరదా చేసినట్టు, మనల్ని పిలిచినట్టు, మనల్ని తిట్టినట్టు రకరకాలుగా అనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన ఈ తరం హీరోయిన్లలో నటన పరంగా సాయి పల్లవే టాప్ అని చెప్పొచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
