Home

»

Latest News

నాగచైతన్య 17న దోచేస్తాడట

Mar 25, 2015 6:04PM

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచేయ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఈ చిత్రంలోని పాటలను రోజుకి ఒక్కొక్కటి చొప్పున రిలీజ్‌ చెయ్యబోతున్నాం. అలాగే ఏప్రిల్‌ 2న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తున్నాం. ఏప్రిల్‌ 3న లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియోను రిలీజ్‌ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 17న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘దోచేయ్‌’ నిలుస్తుంది. అలాగే మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com