Home

»

Latest News

అప్పుడు ‘కృష్ణ’.. ఇప్పుడు ‘దుర్గ’

Jul 05, 2017

‘దుర్గ’టైటిల్ ఓ రేంజ్ లో ఉంది కదూ... ఇలాంటి టైటిల్ మంచి మాస్ హీరోకి పడితే,  డైరెక్టర్ కూడా ఊర మాస్ అయితే... ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కాంబినేషన్ లోనే... ఈ టైటిల్ తో సినిమా రానుంది. ఇంతకీ ఆ హీరో, దర్శకుడు ఎవరు అనేది చెప్పలేదు కదూ. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు వి.వి.వినాయక్. గతంలో వినాయక్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణ’తరహాలో పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని టాక్. ‘ఖైదీ నం150’తర్వాత వినాయక్ చేసే సినిమా ఏంటబ్బా అని అందరూ ఎదురు చూసిన తరుణంలో ‘దుర్గ’తో వినాయక్ రావడం మాస్ ప్రేక్షకులకు నిజంగా సంతోషకరమైన విషయమే. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com