జాగర్లమూడి రాధాకృష్ణ అంటే తెలియక పోవచ్చు గానీ క్రిష్ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. మంచి కాన్సెప్ట్ ఎంచుకుని, హృద్యంగా తెరకెక్కిస్తాడని క్రిష్ కు పేరుంది. ఇన్నాళ్లూ సినిమాల్లో పడిపోయిన క్రిష్, తన పెళ్లిని కూడా పక్కన పెట్టేశాడు. సినిమాలంటే అతనికి అంత వ్యసనం. అయితే పెళ్లి చేసుకోమని తన తల్లి కోరడంతో, ఎట్టకేలకు మూడు ముళ్లు వేయడానికి తలూపాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేస్తున్న రమ్య అనే డాక్టరమ్మ తో క్రిష్ కు పెళ్లి ఫిక్సయ్యింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఇద్దరి ఇష్టాఇష్టాలనూ తెలుసుకుని రెండు వైపులా మాట్లాడుకున్న పెద్దలు, ఆగష్టులో పెళ్లి ముహూర్తం పెట్టారని సమాచారం. ఇప్పటికే క్రిష్ తమ్ముడు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. సినిమాల్లో పడి తన పెళ్లిని నెగ్లక్ట్ చేయద్దని, పెళ్లి చేసుకోమని చాలా కాలంగా క్రిష్ తల్లి చెబుతున్నారట. ఇక లేట్ చేస్తే బాగోదనిపించిందో ఏమో కానీ, క్రిష్ కూడా ఆవిడ మాట కాదనలేక పెళ్లికి ఒప్పేసుకున్నాడు. అదీ విషయం.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలయ్య డైరెక్టర్ కు పెళ్లి ఫిక్సయ్యింది..!
Jun 11, 2016 11:23AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com





.jpg)
