దిల్ రాజు జడ్జిమెంట్ అంటే అదే మరి..!
on Jun 7, 2016
దిల్ రాజు టాలీవుడ్ లో అగ్రనిర్మాతల్లో ఒకరు. భారీ హిట్స్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. అయితే ప్రొడ్యూసర్ గా ఎదగడం కంటే ముందు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల మీద ఆసక్తితో డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చిన దిల్ రాజు, తన జడ్జిమెంట్ తో సక్సెస్ ఫుల్ సినిమాల్ని తీసుకుని లాభాల బాటలో పయనించాడు. అయితే గత కొన్నేళ్లుగా దిల్ రాజు మార్క్ మిస్ అవుతోంది. జడ్జిమెంట్ తప్పుతోంది అన్న మాటలు వినిపించాయి. వరసగా యావరేజ్ సినిమాల్ని తెరకెక్కించిన కారణంగా ఆ మార్క్ పడింది.
అయితే బాహుబలి తర్వాత మాత్రం మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఆ సినిమాను ఏకంగా 24 కోట్లు పెట్టి కొన్న రాజు, మంచి కలెక్షన్ జేబులో వేసుకున్నాడు. తర్వాత తీసిన సుప్రీం, అ ఆ డిస్ట్రిబ్యూషన్ తో ఫ్రాఫిట్స్ లో ఉన్నాడు. మధ్యలో మాత్రం రెండు భారీ సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకోకుండా ఆయన వదిలేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ రెండింటినీ దిల్ రాజు టచ్ చేయలేదు. సరిగ్గా ఈ రెండే డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో దిల్ రాజు జడ్జిమెంట్ అంటే ఇదే మరి అంటూ ఆయన డెసిషన్ ను మెచ్చుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బాహుబలికి 24 కోట్లు పెట్టిన రాజు, ఈ రెండు సినిమాలకు మాత్రం వెనక్కి తగ్గాడు. ఎక్కువ పెట్టడం ఎందుకు అనుకున్నాడో, లేక ఫలితాల్ని ముందే అంచనా వేశాడో తెలియదు గానీ, భారీ ఫ్లాపులను ఎస్కేప్ అయిపోయాడీ గోల్డెన్ హ్యాండ్ ప్రొడ్యూసర్.
Also Read