మెగాస్టార్ కి స్టైల్ లేదా?
on Mar 16, 2015
.jpg)
సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో జరిగిన కొన్ని అనవసర పరిణామాలతో మెగా ఫ్యామిలీలో సంబంధ బాంధవ్యాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాయన దాసరి నారాయణరావు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కోసమే ఈ వేడుకకు వచ్చానని మొదలుపెట్టి.. స్టయిల్ విషయంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల తర్వాత పవనే అంటూ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. డ్యాన్సుల్లో, ఫైట్లలో చిరంజీవి తీసుకొచ్చిన స్టయిల్ గురించి అందరికీ తెలుసు. అలాంటిది చిరును వదిలేసి పవన్‌ను ఆకాశానికెత్తేయడం అభిమానుల్ని అయోమయంలోకి నెట్టింది. తన ప్రసంగమంతా చిరు ప్రస్తావనే రాకుండా చూసుకున్న దాసరి.. బన్నీని మాత్రం తెగ పొగిడారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



