Home

»

Latest News

పూరి ద‌గ్గ‌ర చిరు 'లాక్' అయిపోయాడా?

Apr 14, 2015 11:57AM

చిరంజీవి 150వ సినిమా కోసం ద‌ర్శ‌కుడి ఎంపిక దాదాపుగా ఖ‌రారైపోయింది. పూరి జ‌గ‌న్నాథ్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ ఈ సినిమాకి టేక‌ప్ చేసే అవ‌కాశాల్లేవ‌ని తెలుస్తోంది. ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని న‌మ్మి 150వ సినిమాని అప్ప‌గించే సాహ‌సం చిరు చేయ‌డు. త్రివిక్ర‌మ్‌, రాజ‌మౌళి.. వీళ్ల‌కు ఖాళీ లేదు. శ్రీ‌నువైట్ల చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక పూరి త‌ప్ప‌... స్టార్ ద‌ర్శ‌కుడెవ‌రూ చిరుకు అందుబాటులో లేడు. దాంతో చిరు కూడా పూరికే లాక్ అయిపోవాల్సిన ప‌రిస్థితి. ఇప్పటికే పూరి కూడా... 'ఆటోజానీ' పేరుతో ఓ క‌థ రెడీ చేశాడు. లైన్ కూడాచిరుకి బాగా న‌చ్చింది. దాంతో చిరు - పూరి సినిమా దాదాపుగా ఖాయ‌మైపోయింది. పూరి ఇప్పుడు జ్యోతిల‌క్ష్మి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత వ‌రుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయాలి. అయితే చిరు కోసం ఆ సినిమానీ ప‌క్క‌న పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జూన్‌, జులైల‌లో ఈ సినిమాకి కొబ్బ‌రికాయ్ కొట్టి, ఆగ‌స్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆటోజానీ ప‌ట్టాలెక్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈలోగానే పూర్తి స్ర్కిప్టు రెడీ అయితే.. రంగంలోకి దిగిపోదామ‌ని చిరు కూడా వెయిట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి చిరు 150వ సినిమా ప‌నులు మొద‌లైపోయిన‌ట్టే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com