బాలయ్యకు బాలయ్యే పోటీ
on Apr 10, 2015
.jpg)
సింహా, లెజెండ్, ఇప్పుడు లయన్ ఇలాంటి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్లు చేయాలంటే బాలయ్య వల్లే అవుతుందని, బాలయ్య ను బీట్ చేసే మాస్ హీరో టాలీవుడ్ లో లేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లయన్ ఆడియోకి ముఖ్యఅతిధిగా వచ్చిన చంద్రబాబు బాలయ్య ను ఓ అభిమానిలా పొగిడేశారు. ‘‘గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమా పాటల్ని విడుదల చేశాను. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ‘లయన్’ పాటల్ని విడుదల చేస్తున్నాను. ఇది కూడా రికార్డ్ సృష్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని అన్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య బాలకృష్ణ న్యూమూవీ ‘లయన్’ ఆడియో విడుదలైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫంక్షన్‌కు సినీ ఇండస్ర్టీకి చెందిన ప్రముఖులకే కాకుండా రాజకీయ నేతలూ హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



