Home

»

Latest News

సెన్సార్ బోర్డులో పైరసీ దొంగలు

Jul 27, 2015 6:29PM

ప్రేమమ్ సినిమా మలయాళంలో గత నెల విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ కొన్ని రోజులకే పైరసీ డీవీడీ క్వాలిటీతో సినిమా ప్రింట్ వచ్చేయడంతో నిర్మాతలు షాకయ్యారు. దీని మీద పెద్ద గొడవే జరిగిందక్కడ. బాహుబలి ఒక రోజు ఆలస్యంగా విడుదలవడానికి కూడా ఇదే కారణం. ఐతే సెన్సార్ బోర్డు సభ్యులే సినిమాను పైరసీ చేసినట్లు తేలడం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయంలో నిర్మాతతో పాటు మలయాళ ఇండస్ట్రీ కూడా కదలడంతో వ్యవహారం బాగా సీరియస్ అయింది. పైరసీకి పాల్పడ్డ సెన్సార్ బోర్డు ఉద్యోగులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. వారిపై తీవ్ర చర్యలు తీసుకునేదాకా వదిలే ప్రసక్తే లేదని.. ఇంకెవ్వరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా శిక్షించాలని నిర్మాత అంటున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com