Home

»

Latest News

భోజనం తరువాత స్వీట్ మాదిరి నా పాత్ర.. చిరంజీవి

Oct 3, 2015 10:58AM

శుక్రవారం రామ్ చరణ్ తేజ్ నటించిన "బ్రూస్‌లీ" సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ అడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి "బ్రూస్‌లీ" సినిమాలో ఓ డైలాగ్ ను చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. "బ్రూస్ లీ" ఆడియో సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాంచరణ్ ఈ సినిమాలో నటించేందుకు చాలా కష్టపడ్డాడని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ..ఈ సినిమాలో తన ఎంట్రీ కొసమెరుపులాగ ఉంటుందని.. ఇంకా తన పాత్ర గురించి చెప్పాలంటే భోజనం మొత్తం తిన్నా తరువాత ఒక స్వీటు తిన్న మాదిరిగా ఉంటుంది చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఇంకా ఎలాగూ సినిమా రిలీజ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలో డైలాగ్ చెప్పడానికి ఏముందని బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను అని సినిమాలో రాంచరణ్ కొట్టిన డైలాగ్ ను చిరంజీవిగారు కొట్టారు. ఈ సందర్బంగా తన 150 వ సినిమా వివరాలు కూడా తెలిపారు.  తన 150 సినిమా పూర్తి స్థాయిలో ఉంటుందని.. ఈ సినిమాకు రాంచరణ్, సురేఖ నిర్మిస్తున్నారని.. ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి వివరాలు తెలుపుతానని చెప్పారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com