యుఎస్ లో బ్రహ్మోత్సవం మరింత లోతుల్లోకి..!
on May 25, 2016
సినిమా బాగోకపోతే ఏ మ్యాజిక్కూ మూవీని సేవ్ చేయలేదు. బ్రహ్మోత్సవం సినిమా అందుకు పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొదటి రోజే క్రిటిక్స్, యాంటీ ఫ్యాన్స్, ఫ్యాన్స్ అందరూ ఏక కంఠంతో మూవీ డిజాస్టర్ అని తేల్చేశారు. ఇన్నాళ్లూ మహేష్ కు కంచుకోటలా ఉన్న ఓవర్సీస్ లో ఈ రివ్యూల ప్రభావం గట్టిగా పడింది. మహేష్ మ్యాజిక్ కేవలం సినిమాను మిలియన్ డాలర్ మార్క్ దాటించడం వరకే ఉపయోగపడింది. ఇక ఇప్పుడైతే మహేష్ మ్యానియా, పివిపి భారీ ప్రొడక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ట్యాగు..ఇవేమీ సినిమాను కాపాడలేకపోతున్నాయి. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లు మరింత దారుణంగా పడిపోయాయి. కేవలం 13 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది మహేష్ సినిమా. దీని బట్టి చూస్తే, రానున్న రోజుల్లో, మరింత ఘోరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మహేష్ కు అక్కడ ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తానికి కొనేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. సోమవారం కలుపుకుని ఓవర్సీస్ లో 7.21 కోట్లు కలెక్ట్ చేసింది బ్రహ్మోత్సవం.