బ్రహ్మోత్సవం పబ్లిక్ టాక్..!
on May 20, 2016
సూపర్ స్టార్ మహేష్ పూర్తి క్లాస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈరోజే బ్రహ్మోత్సవం రిలీజైంది. తెలంగాణా మొత్తం సింగిల్ స్క్రీన్స్ లో ఉదయం నుంచే షోస్ పడుతున్నాయి. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యమైన కథాంశంగా కుటుంబ బాంధవ్యాలను చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. ఇంతకు ముందు మహేష్,అడ్డాల కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఏ తరహా సినిమానో, అదే టైప్ లో బ్రహ్మోత్సవం కూడా ఉంటుందట. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ సేమ్ టు సేమ్ ఆ సినిమా టైప్ లోనే జోవియల్ గా, ఫన్ ఓరియెంటెడ్ గా డిజైన్ చేశాడు దర్శకుడు అడ్డాల.
సినిమా తీరు బట్టి చూస్తే, ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టించడం ఖాయం గానే కనిపిస్తోంది. అయితే మాస్ మసాలా కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా ఎక్కదు అనేది మొదటి ఆట చూసినవాళ్లు చెప్పే మాట. అయినా శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే ఎలా ఉంటుందో ముందే తెలుసు కాబట్టి జనాలు ముందే ప్రిపేర్ అయి ఉంటారనడంలో డౌట్ లేదు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలిసి కన్నీళ్లు పెట్టించారని, పబ్లిక్ టాక్.