బ్రహ్మోత్సవం లైవ్ అప్‌డేట్స్: స్టార్టింగ్ అదిరింది..
on May 20, 2016

మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకునే టైం రానేవచ్చింది. అదే బ్రహ్మోత్సవం రిలీజ్. తెలుగు రాష్ట్రాల్లోని పలు ధియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మార్నింగ్ షో పడింది. శ్రీకాంత్ అడ్డాల అనగానే సంప్రదాయాలు, కుటుంబాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూనే టైటిల్స్ దగ్గర నుంచే ఆయన మార్క్ కనపడింది. చాలా సాంప్రదాయపద్ధతిలో సింపుల్‌గా టైటిల్స్ వేశారు. టైటిల్ కార్డులు అవ్వగానే సమంత చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న మన సూపర్‌స్టార్ మహేశ్ ఎంట్రీ. సింపుల్‌గా ఉన్నా ఓ రేజ్ అందంతో మరోసారి అమ్మాయిల హృదయాలు దోచుకున్నాడు. ఫస్ట్ సాంగ్ సంగీత్‌తో స్టార్ట్ అయ్యింది..పాట అవ్వగానే ఎన్‌ఆర్ఐగా కాజల్ ఎంట్రీ బాగుంది..ఇలా ఫస్ట్ థర్టీ మినిట్స్‌లో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిచిపోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



