Home

»

Latest News

బోసి మూతి వంక వాడి చూపుచూడండి!

Aug 16, 2017 12:11PM

‘చల్ చల్ గుర్రం చలాకి గుర్రం..’ అని తాత వీపెక్కి.. ముద్దుల మనవడు స్వారీ చేస్తుంటే... ఆ తాతగారి ఆనందానికి అవధులుంటాయా? ఆ తాతగారు మంత్రి కావొచ్చు.. ముఖ్యమంత్రి కావొచ్చు... స్టార్ కావొచ్చు.. సూపర్ స్టార్ కావొచ్చు.. ఇంట్లో బుల్లి మనవడుంటే మాత్రం...  గుర్రం అయిపోవాల్సిందే. 


మనవడిపై తాతకుండే అక్కర అలాంటిది. తల్లిదండ్రులకు కూడా అంత అక్కర ఉండదంటారు. ఇక్కడ బ్రహ్మానందాన్ని ఒక్కసారి చూడండి. ఆ బుడ్డోడి వంక ఎంత ప్రేమగా చూస్తున్నాడో. ఆయన కళ్లలో ప్రేమ చూస్తుంటే.. తాత ప్రేమ అనిర్వచనీయమైనదని ఎవరైనా ఒప్పుకుంటారు. బయట జనానికి ఆయన కామెడీ కింగే కావొచ్చు... కానీ మనవడి ముందు మాత్రం బోసిమూతి తాతయ్యే.  ముద్దుల మనవడివంక నవ్వులు చిందుస్తూ తాతయ్య మురిపాల నవ్వులు ..  పీకడానికి మీసాలు కూడా లేని బోసిమూతి తాతయ్య  వంక మనవడి తదేకమైన చూపులు... చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో కదూ!

ఇంతకీ బ్రహ్మానందం తాత ఎప్పుడు అయ్యాడా? అనుకుంటున్నారా! గత ఏడాదే బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ వివాహం జోత్స్న అనే అమ్మాయితో జరిగింది. వారిద్దరి కుమారుడే ఈ బొడ్దోడు. పేరు పార్థ. వీడు అడుగుపెట్టిన వేళావిశేషం.. ఆ ఇంటి కళే మారిపోయిందట. వాడి ముద్దు మురిపాలలో మునిగి తేలుతూ ఇంట్లోవారందరూ బిజీ బిజీ అయిపోయారు. మనవడి ఆగమనంతో బ్రహ్మానందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. అందుకేనేమో.. తన మనవడితో తను దిగిన ఓ ఫొటోను తానే స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 

సోషల్ మీడియాకు దూరంగా ఉండే బ్రహ్మానందం.. ఇలా మనవడితో కలిసి సోషల్ మీడియాలో దర్శనమివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అంతా మనవడి మహిమ. ఏమంటారు?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com