Home

»

Latest News

బోయపాటికి స్పీడున్నోడు దొరికాడు..!

Apr 25, 2016 3:46PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు తర్వాత బోయపాటి నెక్ట్స్ మూవీ ఎంటీ? అని సినీ ప్రేక్షకుల మదిలో మెదిలిన ప్రశ్న. భారీ అంచనాల మధ్య విడుదలైన సరైనోడిని ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోవడంతో బోయపాటి తదుపరి సినిమా హీరో ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు శ్రీనివాస్‌ను బోయపాటి డైరెక్ట్ ‌చేయనున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. సరైనోడికి ముందే బెల్లంకొండ శ్రీనివాస్‌తో బోయపాటి సినిమా చేయాల్సి ఉంది. అయితే స్టోరి, స్క్రిప్ట్ వర్క్ రెడీ కాకపోవడంతో స్పీడున్నోడిని పక్కన బెట్టి, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సరైనోడిని రెడీ చేశాడు. ఇప్పుడు ఆ సినిమా రిలీజైపోవడంతో బెల్లంకొండ కుమారుడి సినిమాని సెట్ చేసే పనిలో పడ్డాడు. మరి స్పీడున్నోడి స్పీడుని బోయపాటి వాడుకుంటాడో లేదో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com