Home

»

Latest News

బాషాతో బ‌న్నీని మిక్స్ చేసిన ఎన్టీఆర్‌

Jul 7, 2015 10:40AM



 

నాన్న‌కు ప్రేమ‌తో సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మార్చాడు.  గెడ్డం, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, హై క్లాస్ లుక్‌తో వారెవా అనిపిస్తున్నాడు. ఈ స్టైల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే కొంత‌మంది అభిమానులు మాత్రం.. ఇది కాపీ స్టైల్ అంటూ పెద‌వి విరుస్తున్నారు. స‌న్నాప్ స‌త్యమూర్తి చిత్రంలో బ‌న్నీ హెయిర్ స్టైల్‌ని ఎన్టీఆర్ అచ్చంగా దించేసిన‌ట్టే క‌నిపిస్తుంద‌ని వాదిస్తున్నారు. ఆ పాయింట్‌లోంచి చూస్తే... అదీ నిజ‌మే అనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ గెడ్డం... బాషాలో ర‌జ‌నీకాంత్‌ని త‌ల‌పిస్తోందని కూడా చెబుతున్నారు.

ఈ రెండూ మిక్స్ చేసి స‌రికొత్త స్టైల్ అనుకోమంటే ఎలా అంటూ... సెటైర్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ పై ఇప్పుడు కాపీ ముద్ర ప‌డినా.. ప్ర‌తి సినిమాలోనూ త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌న్న‌ది మాత్రం అర్థ‌మ‌వుతోంది. ఆ విష‌యంలో ఎన్టీఆర్‌ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ సినిమాలో తార‌క్ ఈ గెట‌ప్‌తో ఎంత సేపు క‌నిపిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వ‌ర‌కూ చూపిస్తే ఓకే.. పూర్తిగా ఎన్టీఆర్‌ని ఇదే గెట‌ప్‌లో చూడ‌డం మాత్రం క‌ష్ట‌మే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com