Home

»

Latest News

2016లో మోక్షజ్ఞని తెర‌పై చూడొచ్చా?

Aug 13, 2015 8:21PM

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?? 2016లో మోక్షజ్ఞని తెర‌పై చూడొచ్చా?? ఈ సినిమాకి ద‌ర్శకుడు ఎవ‌రు? ఏ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. నంద‌మూరి అభిమానుల్ని ఊరిస్తున్న ప్రశ్నలివి. నంద‌మూరి ఫ్యాన్స్ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం బాల‌య్య క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇప్ప‌టికే అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న మోక్ష‌జ్ఞ క‌ఠోర శిక్ష‌ణ‌లో ఉన్నాడు. బాలయ్య త‌న కుమారుడికి న‌ట‌న‌, వాచ‌కం, డ్యాన్సుల్లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నాడు.

మోక్షజ్ఞ ఈ యేడాది సెప్టెంబర్ 6వ తేదీతో 21 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఆ శుభదినాన అతని సినీరంగ ప్రవేశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందట! మోక్షజ్ఞ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంలో మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు.రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీను, వివి.వినాయ‌క్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. అయితే మిర్చి, శ్రీమంతుడు సినిమాల‌తో బెస్ట్ ఫెర్‌ఫెక్ష‌నిస్టుగా పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ కూడా మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేసేపేర్ల లిస్టులోకి వ‌చ్చి చేరాడు.

వినాయ‌క్ ఇప్ప‌టికే బెల్లంకొండ శ్రీను గ్రాండ్‌గా లాంచ్ చేసి, అఖిల్‌ను తెరంగ్రేటం మూవీతో బిజీగా ఉన్నాడు. బోయపాటి అంటే నంద‌మూరి, టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ వ‌చ్చేస్తుంది. మాస్ పంచ్‌ల‌తో ద‌ద్ద‌రిల్లింప‌చేస్తాడు. కొరటాలకు కూడా ఛాన్స‌లున్న‌ట్టు టాక్‌. ఈ డైరెక్ట‌ర్ల‌యితే అటు క్లాస్ ట‌చ్‌తో పాటు మాస్ మూవీతో గ్రాండ్‌గా మోక్ష‌జ్ఞ‌ను టాలీవుడ్ ఎంట్రీ చేయించే స‌త్తా ఉన్న‌వారే. వీరిలో ఫైన‌ల్‌గా బాల‌య్య ఎవ‌రిని సెల‌క్ట్ చేస్తాడ‌నేది త్వరలో తేలనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com