Home

»

Latest News

బాహుబ‌లికి 'వందే'సిన జక్క‌న్న‌

Jul 2, 2015 12:18PM

మా సినిమా ఇంత వ‌సూలు చేస్తుంది, ఇన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది.. అంటూ ముందే లెక్క‌లు బ‌య‌ట‌పెట్ట‌డానికి చాలా ధైర్యం, త‌మ సినిమాపై బోల్డంత న‌మ్మ‌కం కావాలి. సినిమాని ఓ య‌జ్ఞంలా భావించి, ఆహోరాత్రులు క‌ష్ట‌ప‌డి, త‌న క‌థ‌ని వెండితెర‌పై రంగుల హ‌రివిల్లులా ఆవిష్క‌రించే రాజ‌మౌళి మాత్రం ఎప్పుడూ గొప్ప‌లు పోలేదు. మంచి సినిమా తీశాం.... చూడండి అంటాడంతే. అయితే తొలిసారి రాజ‌మౌళి త‌న సినిమా సాధించే రికార్డుల గురించి క‌ల‌లుకంటున్నాడు. బాహాటంగానే చెప్పేస్తున్నాడు. ''బాహుబ‌లి తెలుగులో వంద కోట్లు సాధించి తీరుతుంది'' అంటూ ఓ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి... అంద‌రికీ షాక్ ఇచ్చాడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమా ఎంత వ‌సూలు చేస్తుంది? అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఎదురైన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి ఇలా స్పందించాల్సివ‌చ్చింది. సాధార‌ణంగా ఇలాంటి విష‌యాల్ని బ‌య‌ట‌చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని రాజ‌మౌళి 'వంద కోట్లు ఖాయం' అనేస‌రికి... చిత్ర‌సీమ షాక్ తింది. రాజ‌మౌళి న‌మ్మ‌కానికి ఓ భారీ రీజ‌న్ ఉంది లెండి. బాహుబ‌లి సినిమాని తెలుగు రాష్ట్ర్రాల్లో ఏకంగా రెండు వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. అనుకొన్న ప్లాన్ ప్ర‌కారం.. అన్నీ వ‌ర్క‌వుట్ అయితే.. తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల‌కు పైనే వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ‌మౌళి ధీమా అదే! అదే జోరు తొలివారం కొన‌సాగితే.. బాహుబ‌లి వంద చేరు కోవ‌డం ఖాయం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com