Home

»

Latest News

పారితోషికంతో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌భాస్‌

Jul 8, 2015 11:19AM



 

అంద‌రి నోటా.. బాహుబ‌లి మాటే. బాహుబ‌లి బ‌డ్జెట్ ఇంత‌, అంత అని లెక్క‌లు ఘ‌నంగా చెప్పుకొంటున్నారు. మ‌రి.. పారితోషికాల మాటేంటి?  రాజ‌మౌళి ఎంత పారితోషికం తీసుకొన్నాడు?  ప్ర‌భాస్ కి ఎంతిచ్చారు?  అనే విష‌యాల్ని మాత్రం చిత్ర‌బృందం బ‌య‌ట‌కు చెప్ప‌డానికి నిరాక‌రిస్తోంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... ప్ర‌భాస్ పారితోషికం విష‌యం కాస్త లీక్ అయ్యింది.

ప్ర‌భాస్‌కి ఈసినిమా కోసం రూ.25 కోట్లు అప్ప‌గించార‌ట‌. అదీ.. రెండు ద‌ఫాలుగా. తొలుత ప్ర‌భాస్‌కి రూ.18 కోట్ల పారితోషికం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌. అయితే.. ఈ సినిమాకి రెండున్న‌రేళ్లు కేటాయించ‌డం వ‌ల్ల‌.. ఇంకో రూ.7 కోట్లు ఇవ్వాల‌ని నిర్మాత‌లు భావించి.. షూటింగ్ చివ‌రి రోజున ఆ మొత్తాన్ని ఒకేసారి ముట్ట‌జెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ `వ‌ద్దు.. వ‌ద్దు..` అన్నా నిర్మాత‌లు బ‌ల‌వంతంగా చేతిలో పెట్టార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప‌డిన క‌ష్టం అంత‌టిది మ‌రి. ప్ర‌భాస్‌కే రూ.25 కోట్లు ఇచ్చారంటే మ‌రి బాహుబ‌లి రూప‌శిల్పికి.. జ‌క్క‌న్న‌కు ఎంతివ్వాలో..??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com