Home

»

Latest News

మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ను పట్టించిన బాహుబలి మూవీ..ఎలా..?

May 2, 2017 5:09PM

బాహుబలి మూవీ ఏంటి మోస్ట్ ‌వాంటెడ్ క్రిమినల్‌ను పట్టించడమేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..ఒడిశాకు చెందిన కరడుగట్టిన దొంగ సంభవ్ ఆచార్య. ఏటీఎంలు కనిపిస్తే చాలు కొల్లగొట్టడం ఇతని స్టైల్. ఇప్పటి వరకు ఎన్నో ఏటీఎంలను బద్దలుకొట్టి సొమ్ముతో ఊడాయించాడు..చాలా సార్లు పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకునేవాడు. సంభవ్‌ని ఎలాగైనా బంధించాలని భావించిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.

ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందిరిలాగే సంభవ్ కూడా అనుకున్నాడు. అదే అతని కొంప ముంచింది..బాహుబలి ద కన్‌క్లూజన్‌ను వీక్షించేందుకు భువనేశ్వర్‌లోని ఓ థియేటర్‌కు సంభవ్ ఆచార్య వచ్చాడు..అప్పటికే అతని ఫోటో అన్ని స్టేషన్లకు వెళ్లడంతో అక్కడ ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ స్క్వాడ్ పోలీసులు సంభవ్‌ను గుర్తించి..వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సుమారు 50 ఏటీఎం దొంగతనం కేసులు ఉన్నాయి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com