Home

»

Latest News

బాహుబ‌లి ట్రైల‌ర్ రెడీ కాలేదా?

May 28, 2015

ఈనెల 31న ప్ర‌భాస్ అభిమానుల‌కు పండ‌గే. ఎందుకంటే ఆ రోజు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న `బాహుబ‌లి` ఆడియో పండ‌గ‌. బాహుబ‌లి పాట‌ల్ని వినొచ్చు. ఆ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తుల్ని తెలుసుకోవ‌చ్చు. దాంతో పాటు.. ట్రైల‌ర్ కూడా చూసేయొచ్చ‌ని అభిమానులు ఆశ‌లు పెట్టుకొన్నారు. అయితే ఆ ఆశ‌ల్ని పోస్ట్‌పోస్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే బాహుబ‌లి ఆడియోని వాయిదా వేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈనెల 31న బాహుబ‌లి ఆడియో, థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి టీమ్ ప్లాన్ ఇర‌వై రోజుల క్రిత‌మే ప్లాన్ చేసింది. ఆడియో రైట్స్‌తో పాటు, ప్ర‌సార హ‌క్కులు భారీ రేట్ల‌కు అమ్మేశారు. హైద‌రాబాద్ లోని హైటెక్స్‌ని వేదిక‌గా ఎంచుకొన్నారు. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆడియో వేడుక వాయిదా ప‌డింద‌ట‌. హైటెక్స్‌లో వేడుక నిర్వ‌హించ‌డానికి ఇంకా ప‌ర్మిష‌న్లు అంద‌లేద‌ట‌. దానికి తోడు థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ ఇంకా సిద్ధం కాలేద‌ట‌. ఓ వెర్ష‌న్ పూర్త‌యినా.. అది రాజ‌మౌళి అండ్ టీమ్‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌రో వెర్ష‌న్ రూపొందించే ప‌నిలో ఉంద‌ట బాహుబ‌లి టీమ్‌. దానికి కాస్త టైమ్ ప‌ట్టేట్టుంది. అందుకే బాహుబ‌లి ఆడియో వేడుక‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌. మ‌రి ఈ సంగ‌తి నిజ‌మో కాదో తెలియాలంటే రాజ‌మౌళి నోరు విప్పాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com