Home

»

Latest News

ముంబైలో ''బాహుబలి'' తొలి షో పడింది

Jul 9, 2015 11:43PM

తెలుగు సినీ చరిత్రలో ఇంకే సినిమాపైనా లేనంత హైప్‌ 'బాహుబలి' మీద క్రియేట్‌ అయ్యింది. మొదటిరోజే చూసేయాలనే ఉత్సాహంతో ఉన్న ప్రేక్షకులకోసం దాదాపు ప్రతీ టౌన్‌సిటీలోని అన్ని థియేటర్స్‌లో బాహుబలి షోస్ వేస్తున్నారని ట్రేడ్ వర్గాల కథనం. 'బాహుబలి' ఫస్ట్ షో మా దగ్గరంటే మా దగ్గరని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'బాహుబలి' ఫస్ట్ షో ఇండియాలో పడిపోయిందట. అది ఎక్కడో కాదు బాలీవుడ్ అడ్డా అయిన ముంబై లో 'బాహుబలి' ఫస్ట్ షో పడిందట.

''బాహుబలి'' హిందీ వర్షెన్‌ రైట్స్ సొంతం చేసుకున్న కరణ్‌ జోహార్ ఈ రోజు సాయంత్రం 8 గంటలకు బాలీవుడ్ లో తన సన్నిహితుల కోసం స్పెషల్ షో వేశారట. ఈ షో చూసిన ఇండస్ట్రీ పెద్దలు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. రానా నటనకైతే అందరూ ఫిదా అయిపోయినట్టు సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో బాహుబలి ఫస్ట్ 12గంటలకు పడనుంది.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com