Home

»

Latest News

షార్ట్‌ఫిల్మ్స్‌ చరిత్రలో తెలుగువన్ మరో ప్రయోగం

Aug 3, 2017 12:28PM

తెలుగువారికి షార్ట్‌ ఫిల్మ్స్‌ను పరిచయం చేసి..ఎంతోమంది ప్రతిభావంతులైన వారికి దర్శకులుగా, నటీనటులుగా అవకాశం కల్పించి వారి సినీప్రయాణానికి తొలిమెట్టుగా నిలిచింది తెలుగువన్. తాజాగా తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలికి స్పూఫ్‌గా బాహుబలి-3 ది కన్‌ఫ్యూజన్‌‌ని రిలీజ్ చేసింది తెలుగువన్‌. దీని ప్రత్యేకత ఏంటంటే తెలుగు షార్ట్ ఫిల్మ్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సీజీ వర్క్స్‌తో ఈ స్పూఫ్‌ను తెరకెక్కించారు. టైటిల్స్ దగ్గరి నుంచి ఎండ్ కార్డ్ వరకు అద్భుతమైన గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. అందుకు తగ్గట్టే ఈ స్పూఫ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే లక్ష వ్యూస్‌తో దూసుకెళ్తొంది. ఈ స్పూఫ్‌‌కు వాలీ సదా దర్శకత్వం వహించగా..కంఠమనేని రవిశంకర్ నిర్మాతగా వ్యవహరించారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com