Home

»

Latest News

రాజ‌మౌళిని ఇబ్బంది పెడుతున్న ప్ర‌భాస్‌?

May 8, 2017 12:58PM

ప్ర‌భాస్‌లేక‌పోతే... బాహుబ‌లి లేదు అని రాజ‌మౌళి, రాజ‌మౌళి లేక‌పోతే బాహుబ‌లి లేదు అని ప్ర‌భాస్... ప‌ర‌స్ప‌రం తెగ పొగిడేసుకొన్నారు. కేవ‌లం రాజ‌మౌళిపై న‌మ్మ‌కంతోనే ఐదేళ్ల త‌న కెరీర్‌ని ప‌ణంగా పెట్టాడు ప్ర‌భాస్‌. దానికి త‌గిన ప్ర‌తిఫ‌లం కూడా ఇప్పుడు అనుభ‌విస్తున్నాడు. అయితే.. ఎందుక‌నో.. ఈమ‌ధ్య రాజ‌మౌళి మాట ప్ర‌భాస్ విన‌డం లేద‌ని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి 2 విడుద‌ల అనంత‌రం.. ఈ టీమ్‌తో త‌న‌కేమాత్రం సంబంధం లేద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ట‌. `బాహుబ‌లి 2`విడుద‌ల అనంత‌రం లండ‌న్ లో ఓ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేసింది చిత్ర‌బృందం. దానికి ప్ర‌భాస్ కావాల‌నే డుమ్మా కొట్టిన‌ట్టు స‌మాచారం.  

ముంబైలో క‌ర‌ణ్ జోహార్ ఏర్పాటు చేసిన పార్టీకీ ప్ర‌భాస్ `రాను` అని తెగేసి చెప్పేశాడ‌ట‌. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నాడ‌ని, అక్క‌డ త‌న స్నేహితుల‌తో క‌ల‌సి విహార యాత్ర‌లో బిజీగా ఉన్నాడ‌ని, అస‌లు బాహుబ‌లి టీమ్ కి ఏమాత్రం ట‌చ్‌లో లేడ‌ని తెలుస్తోంది. ఇంత‌లోనే ప్ర‌భాస్‌కీ రాజ‌మౌళికీ మ‌ధ్య ఏమైంది??  అంటూ టాలీవుడ్లో గుస‌గుస‌లు మొద‌లైపోయాయి. `ప్ర‌భాస్‌కి పార్టీలంటే పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. అందుకే క‌ర‌ణ్ జోహార్ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించాడు` అని ప్ర‌భాస్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. మ‌రి లండ‌న్‌లో షోకి ఎందుకు డుమ్మా కొట్టిన‌ట్టో..??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com