Home

»

Latest News

బాహుబ‌లి థియేట‌ర్లో ప‌వ‌న్ అభిమానుల గోల‌

May 1, 2017 11:09AM

ప‌వ‌న్ అనే మాట‌కు ఉన్న శ‌క్తేంటో మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ అభిమానులు నిరూపించుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాహుబ‌లి 2లో విశ్రాంతి ఘ‌ట్టానికి ప‌వ‌న్‌క‌ల్యాణే స్ఫూర్తి.... అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్నాడో, లేడో... ప‌వ‌న్ అభిమానులు త‌మ ప్ర‌తాపం చూపించ‌డంలో మునిగిపోయారు. ఫేస్ బుక్ పేజీల్లో, ట్విట్ట‌ర్ల‌లో ఈ వార్తే హ‌ల్ చ‌ల్ చేసింది. `బాహుబ‌లి 2` ఇంత‌టి విజ‌యానికి కార‌ణం ప‌వ‌ర్ స్టారే అన్నంత‌గా చెల‌రేగిపోతున్నారు.

అంతేకాదు.. ఇప్పుడు థియేట‌ర్ల‌లోనూ `ప‌వ‌ర్ స్టార్‌. ప‌వ‌ర్ స్టార్‌` అనే మాటే మంత్రంగా వినిపిస్తోంది. హైద‌రాబాద్‌లోని కొన్ని థియేట‌ర్ల‌లో ఆదివారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు హంగామా క‌నిపించింది. స‌రిగ్గా విశ్రాంతి స‌న్నివేశం వ‌చ్చిన‌ప్పుడు `ప‌వర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్‌` అంటూ అభిమానులంతా ముక్త కంఠంతో అర‌వ‌డం ప్రారంభించార్ట‌. దాంతో... కీర‌వాణి ఇచ్చిన ఆర్ ఆర్‌.. బాహుబ‌లి.. బాహుబ‌లి అంటూ వినిపించిన కోర‌స్ కూడా గాల్లో క‌లిసిపోయింద‌ని టాక్‌. ఇంట్ర‌వెల్ అవ్వ‌గానే.. ప‌వ‌న్ ఫ్యాన్సంతా బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని, కేవ‌లం ఆసీన్ కోస‌మే సినిమాకి వెళ్లార‌ని తెలుస్తోంది. మొత్తానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఎందుకోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట తీసుకొచ్చాడో తెలీదు గానీ.. దాని ప్ర‌భావం మాత్రం మొద‌లైపోయింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com