Home

»

Latest News

రాజ‌మౌళికి.. తెలుగు మీడియా ఓ క‌రివేపాకు

Apr 25, 2017 8:55PM

బాహుబ‌లి సూప‌ర్ డూప‌ర్ హిట్టయ్యింది.. రికార్డులు సృష్టించింది.. తెలుగు సినిమా ద‌శ‌నీ దిశ‌నీ మార్చింది. ఈ విష‌యంలో తెలుగు మీడియాదేం చిన్న పాత్రేం కాదు. రాజ‌మౌళి ఓ అంత‌ర్జాతీయ స్థాయి సినిమా తీస్తున్నాడ‌ని ముందు నుంచీ మోస్తూ వ‌చ్చింది తెలుగు మీడియానే.  త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా ఇద‌ని, బాహుబ‌లి చూడ‌క‌పోతే పాప‌మ‌నే రేంజులో `ఉచిత‌` ప్ర‌చారం చేసి పెట్టింది. ఈ సంగ‌తి రాజ‌మౌళికీ తెలుసు. కానీ... తెలుగు మీడియా అన్నా, ఇక్క‌డి జ‌ర్న‌లిస్టులు అన్నా ఏమాత్రం లెక్క‌లేదట అంటూ ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.. రాజ‌మౌళి దృష్టిలో తెలుగు మీడియా అంటే కూర‌లో క‌రివేపాకు లా త‌యారైందట. బాహుబ‌లి 2 కి సంబంధించిన ప్ర‌మోష‌న్లు విరివిగా సాగుతున్నాయి. కానీ. ఇక్క‌డ బాదు, బాలీవుడ్‌లో.

అక్క‌డ ప్ర‌తీ ఛాన‌ల్‌నీ, ప్ర‌తీ పేప‌ర్‌నీ పిలిచి మ‌రీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాహుబ‌లి సెట్లో తెలుగు మీడియా ఇప్ప‌టి వ‌ర‌కూ అడుగు పెట్ట‌లేదట. అదే కొన్ని ఇంగ్లీష్ ఛాన‌ళ్లైతే.. వాళ్ల‌ని పిలిచి మ‌రీ సెట్లు చూపించారు. ఇప్పుడూ అంతేనట. తెలుగులో అర‌కొర ఇంట‌ర్వ్యూల‌తో స‌రిపెడుతున్నారు. మీడియాని ఓ చోట కూర్చోబెట్టి గుంపులో గోవింద‌య్య త‌ర‌హా ఇంటర్వ్యూలు ఇచ్చి మ‌మ అనిపిస్తున్నారట. ఎందుకంటే ఇక్క‌డ ప‌బ్లిసిటీ చేసినా చేసుకోక‌పోయినా బాహుబ‌లికి వ‌చ్చే న‌ష్టం ఏం లేదు. పైగా `ఈ సినిమా మీరు చూడొద్దు` అని టంకు వేసినా జ‌నం చ‌చ్చిన‌ట్టు చూస్తార‌న్న ధీమాగా ఉన్నారట . మీడియా వాళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోయినా క‌వ‌రేజికి ఢోకా లేద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారట .

అస‌లు తెలుగులో మీడియా అంటూ ఒక‌టుంద‌ని, వాళ్ల  ప్రోగ్బ‌లంతోనే బాహుబ‌లికి ఐదేళ్లుగా ఉచిత ప్ర‌చారం ల‌భించింద‌న్న విష‌యం కూడా రాజ‌మౌళి అండ్ టీమ్ మ‌ర్చిపోయిందంటూ కొందరు సినీ జనాలు చర్చించుకుంటున్నారట. ముంబై వాళ్ల‌కు అలా కాదు. వాళ్ల‌కు మాత్రం కావ‌ల్సిన‌న్ని ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్లూ. తెలుగులో ఒక ప్రముఖ దిన ప‌త్రిక‌కు త‌ప్ప‌.. మ‌రెవ్వ‌రికీ స్పెష‌ల్‌గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం లేదని. ఇదేం ప‌క్ష‌పాత బుద్దో అర్థం కావ‌డం లేదంటోందట మిగిలిన మీడియా. తీసింది తెలుగు సినిమా.. మోసింది తెలుగు మీడియా.. కానీ వాళ్లే అక్క‌ర్లేకుండా పోయారా ..? రాజ‌మౌళీ.. మ‌రీ ఇంత చిన్న చూపు అవ‌స‌ర‌మా??  నీకిది భావ్య‌మా..?? అంటున్నారట తెలుగు మీడియా జనాలు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com