Home

»

Latest News

‘ఆగస్ట్ 11’ మీదే ఎందుకంత ప్రేమ?

Jul 26, 2017 11:10AM

 

సినిమాలు మామూలుగా శుక్రవారాలు విడుదలవుతుంటాయి. ఎందుకంటే... తర్వాత వచ్చే శనివారం వీకెండ్. ఆ తర్వాత ఆదివారం. మూడు రోజులు వసూళ్లు కుమ్మేయొచ్చు. అది వాళ్ల స్టేటజీ. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా ఏదైనా పండగ వచ్చిందనుకోండి... ఇక ఆ రోజు కూడా వసూళ్ల వర్షమే.  అదే సోమవారం నుంచి సంక్రాంతే మొదలైతే... దాన్ని బంపర్ బొనాంజా అంటారు. నాలుగు రోజులు పండగ. ఏడు రోజులు వసూళ్లు. ఇప్పుడు ఈ గోలంతా దేనికి? అనుకుంటున్నారా?  దాదాపు సంక్రాంతి అంత బంపర్ బొనాంజాని  రాబోతున్న‘ఆగస్ట్ 11’కూడా అందించనుంది. అందుకే...

అదే రోజున థియేటర్లకు వచ్చేయడానికి ముగ్గురు యువ హీరోల సినిమాలు ఇప్పటికే రెడీ అయిపోయాయి. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటో చెప్పనేలేదు కదూ!  అనూ రాఘవపూడి దర్శకత్వంలో... నితిన్ నటించిన  ‘లై’... , తేజ దర్శకత్వంలో రానా నటించిన  ‘నేనే రాజు నేనే మంత్రి’...,  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన  ‘జయ జానకీ నాయక’. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మూడు సినిమాలూ ఆగస్ట్ 11నే విడుదల కానున్నాయి.   

ఇప్పటికే.. ఈ చిత్రాల టీజర్లు... అటు టీవీల్లో... ఇటు సోషల్ మీడియాలో తెగ హంగామా  చేస్తున్నాయి. పబ్లిసిటీ విషయంలో కూడా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. అరుదుగా మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని నిర్మాతల భావిస్తున్నారు. ఇంతకీ ‘ఆగస్ట్ 11’కి ఆ ప్రత్యేకత ఎందుకొచ్చింది?  అనేగా మీ ప్రశ్న.   ‘ఆగస్ట్ 11’ కూడా మామూలు శుక్రవారమే. దాని తర్వాత వీకెండ్. ఆ తర్వాత ఆదివారం.. అక్కడ్నుంచే ఉంది అసలు లెక్క. సోమవారం ‘శ్రీకృష్ణాష్టమి’.. మంగళవారం ‘ఆగస్ట్ 15’. మొత్తంగా అయిదు రోజులు వసూళ్ల ప్రవాహమే. ఇంకెందుకు ఊరుకుంటారు మనోళ్లు. చకచకా విడుదల కార్యక్రమాలు పూర్తి చేసేస్తున్నారు. సినిమాలు ఎలా ఉన్నా... ఆ అయిదు రోజుల పుణ్యమా అని ఒడ్డున పడిపోవచ్చని వారి నమ్మకం. అందులో నిజం లేకపోలేదు. అసలు ఇదే టైమ్ లో ఏదన్నా పెద్ద సినిమా పడితే.. నా సామిరంగా...! ఈజీగా వందకోట్లు... ఏమంటారు?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com