Home

»

Latest News

నవంబర్‌ 7న యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘జైహింద్‌ 2’

Nov 04, 2014

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘జైహింద్‌2’. సుర్విన్‌ చావ్లా, చార్లెట్‌ క్లారి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకనిర్మాత అర్జున్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌ 7న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. అర్జున్‌ జన్యా చాలా మంచి మ్యూజిక్‌ అందించారు. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని చాలా హై స్టాండర్డ్స్‌లో చేశాము. ఫైట్స్‌ విషయానికి వస్తే నా గత చిత్రాల ఫైట్స్‌ అన్నీ ఒక వైపుంటే ఈ సినిమా ఫైట్స్‌ మరో వైపు నిలుస్తాయి. ఈ సినిమాలో ఎమోషనల్‌ క్యారెక్టర్‌  చేశాను. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బ్యాంకాక్‌, సింగపూర్‌, యు.కె దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

బ్రహ్మానందం, అలీ, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, షఫీ, అమిత్‌ కుమార్‌ తివారీ, వినయ్‌ ప్రసాద్‌, రవికాలే తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కె.కె, ఆర్ట్‌: శశిధర్‌ అడప, సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com