రుద్రమదేవి మిస్..అనుష్క ఫిక్స్..!!
on Sep 26, 2015
ఫిల్మ్ లవర్స్ కి షాకింగ్ న్యూస్. అనుష్క నటించిన చారిత్రాత్మక మూవీ రుద్రమదేవి మళ్ళీ వాయిదా పడింది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం రుద్రమదేవి అక్టోబర్ 9న రిలీజ్ కావడం లేదట. గత కొన్ని నెలలుగా రుద్రమదేవి సినిమా వాయిదాకి 3D గ్రాఫిక్స్ కారణంగా చెబుతున్న గుణశేఖర్ ..అసలు కారణం మాత్రం బయటకు చెప్పడం లేదు.
అయితే ఈ సినిమా రిలీజ్ కి 3D గ్రాఫిక్స్ కారణం కాదని..ఫైన్యాన్షియాల్ ప్రాబ్లంస్ ముఖ్య కారణమని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది మాత్రం గుణశేఖర్ త్వరలో రీవిల్ చేస్తారట. రుద్రమదేవి సినిమా వాయిదా పడడంతో ఆ డేట్ క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు సైజ్ జీరో టీమ్. అనుష్క నటించిన సైజ్ జీరో అక్టోబర్ 9న రిలీజ్ కాబోతుండడం విశేషం. అయితే రుద్రమదేవి మిస్ అయిన అనుష్క మాత్రం అభిమానులను అలరించడానికి ఫిక్స్ అయిపొయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
