Home

»

Latest News

బ‌న్నీకీ హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది?

Jul 1, 2015 10:17AM


దేశ‌ముదురుతో అల‌రించిన జంట‌... అల్లు అర్జున్ - హ‌న్సిక‌. ఆ సినిమా వ‌చ్చి దాదాపుగా ప‌దేళ్ల‌య్యింది. ఆ త‌ర‌వాత ఈ జంట‌ని మ‌ళ్లీ తెర‌పై చూసే అవ‌కాశం రాలేదు. ఇటీవ‌ల బ‌న్నీ - బోయ‌పాటి సినిమాకి హ‌న్సిక‌ను క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని చెప్పుకొన్నారు. అయితే ఆ స్థానంలోకి ర‌కుల్ వ‌చ్చి చేరిపోయింది. హ‌న్సిక‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక బ‌న్నీ ఉన్నాడ‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

బోయ‌పాటి శ్రీ‌ను హ‌న్సిక వైపు మొగ్గు చూపితే.. బ‌న్నీ మాత్రం 'హ‌న్సిక వ‌ద్దు' అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. దాంతో హ‌న్సిక ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని టాక్‌.  దాంతో బ‌న్నీకి, హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని, అది బ‌న్నీ మ‌న‌సులో పెట్టుకొన్నాడ‌ని మెగా కాంపౌండ్ లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తెలుగులో హ‌న్సిక చేసిన తొలి సినిమా దేశ‌ముదురు. ఆ టైమ్‌లోనే హ‌న్సికి హెడ్ వెయిట్ కాస్త ఎక్కువ‌గా ఉండేద‌ట‌. అది న‌చ్చ‌కే.. బ‌న్నీ ఆమెను ప‌క్క‌న పెట్టాడ‌ని తెలుస్తోంది. అయితే.. చిత్ర వ‌ర్గాలు మాత్రం.. ''బ‌న్నీ ప‌క్క‌న నాజూకు అమ్మాయిలే బాగుంటారు. హ‌న్సిక బొద్దుగా ఉంది.. అందుకే ఆమె ప్లేసులో ర‌కుల్‌ని తీసుకొన్నాం'' అంటున్నాయి. మ‌రి ఈ రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో బ‌న్నీకే తెలియాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com