English | Telugu

దేశం కోసం అల్లు అర్జున్ యుద్ధం..

on Jun 14, 2017

 

దువ్వాడ జగన్నాధం ఇంకా విడుదల అవ్వనేలేదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్పుడే వక్కంతం వంశీ దర్శకత్వంలో రానున్న తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మొదలెట్టేసాడు. ఈ రోజు జరిగిన మూవీ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ దాదాపు పాల్గొన్నారు. ఇంతకీ, అల్లు అర్జున్ ఈ చిత్రంలో చేసే పాత్ర ఏంటో తెలుసా... తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ సోల్జర్ గా కనిపించనున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. బడ్జెట్ లో ఎక్కువ భాగం ఇవి చిత్రీకరించడానికే కేటాయిస్తున్నారట. తన గత చిత్రం సరైనోడులో సోల్జర్ పాత్ర చేసినప్పటికీ, ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. కానీ, నా పేరు సూర్య లో కంప్లీట్ సోల్జర్ అవతారంలో అలరించనున్నాడు. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి సరైన లొకేషన్స్ కోసం వెదుకుతున్నారు. అల్లు అర్జున్ సరసన కన్నడ భామ రష్మిక మండన్న నటించనుంది. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. తమిళ నటుడు శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here